అనంతవరంలో రహదారిపై నాట్లు వేసి నిరసన
BPT: కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలోని ఆర్అండ్‌బీ ప్రధాన రహదారిపై వాహనదారులు, స్థానికులు బుధవారం నాట్లు వేసి నిరసన తెలిపారు. గుంతల రహదారుల్లో వర్షపు నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. కొన్నేళ్ల నుంచి ఇక్కడి రహదారులు అధ్వానంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారులను పునఃనిర్మించాలని కోరుతున్నారు.