ప్రాణం మీదకు వచ్చిన గాలిపటం
VSP: గాజువాకలో ఆకాశ్(9) అనే బాలుడు గాలిపటం ఎగరేస్తున్న క్రమంలో గాలిపటం హైటెన్షన్ విద్యుత్తు తీగల్లో చిక్కుకుంది. దాన్ని లాగే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనలో సమీపంలోని ఇళ్లలో విద్యుత్తు పరికరాలు కాలిపోయాయి. బాలుడిని మొదట ప్రైవేటు ఆసుపత్రికి, ఆపై కేజీహెచ్‌కు తరలించగా, ప్రస్తుతం బర్న్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.