బస్సు ప్రమాదంలో వెలుగులోకి కీలక అంశాలు
TG: చేవెళ్ల బస్సు ప్రమాదంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కంకర ఓవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో యజమాని లక్ష్మణ్ టిప్పర్‌లోనే ఉన్నాడని, లడారం-శంకర్‌పల్లి వరకు లక్ష్మణ్ టిప్పర్‌ను డ్రైవ్ చేశాడని చెప్పారు. ఆ తర్వాత డ్రైవర్ ఆకాష్ నడిపాడని, ప్రమాదంలో గాయపడిన లక్ష్మణ్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడని అన్నారు.