ఈనెల 22వ తేదీకి మండల సమావేశం వాయిదా

ఈనెల 22వ తేదీకి మండల సమావేశం వాయిదా

BPT: సంతమాగులూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా దానిని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు సంతమాగులూరు మండల పరిషత్ ఎంపీడీవో జ్యోతిర్మయి తెలిపారు. 22వ తేదీన ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.