అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

KMR: చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు తాడ్వాయి ఎస్సై నరేష్ ఆదివారం తెలిపారు. కనకల్ గ్రామానికి చెందిన నారాయణ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇటీవల గ్రామానికి వచ్చాడన్నారు. గ్రామంలో ఇంటి నిర్మాణం చేపట్టగా అప్పులు పెరిగినట్లు తెలిపారు. చేసిన ఆకులు తీర్చలేక గ్రామ శివారులో గల చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఆయన వివరించారు.