WPL 2026: పూర్తి షెడ్యూల్ విడుదల
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 4వ ఎడిషన్(WPL 2026)కు సంబంధించి BCCI పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 9న నవీ ముంబై వేదికగా తొలి మ్యాచ్ ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. మొత్తం 28 రోజుల్లో 22 మ్యాచులు జరగనుండగా.. ఫిబ్రవరి 5న ఫైనల్‌కు వడోదర ఆతిథ్యమివ్వనుంది. 2 మ్యాచులు మినహా అన్నీ రాత్రి సమయానికే జరగనున్నాయి.