చంచల్‌గూడ జైలులో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ

చంచల్‌గూడ జైలులో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ

HYD: చంచల్‌గూడ జైల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జైల్లో ఖైదీలుగా ఉన్న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జాఫర్ అనే ఖైదీపై మరో ఖైదీ దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘర్షణలో జైల్లో ఉన్న అద్దాలు ధ్వంసం అయినట్లు సమాచారం. ఈ ఘర్షణలో ఇద్దరకి తీవ్రగాయాలయ్యాయి. వేంటనే  జైలు అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారి మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి చేసుకున్నట్లు సమాచారం.