నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

హన్మకొండ నగరంలో మరమ్మతు పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు టౌన్ డీఈ సాంబ రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఉ.10 నుంచి మ.12 వరకు రాంనగర్, యాదవ నగర్ సబ్ స్టేషన్ల పరిధిలో అంతరాయం ఉంటుందన్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు నక్కలగుట్ట, మధ్యాహ్నం 3గంటల నుంచి 5వరకు యాదవ నగర్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ నిలిపివేస్తామన్నారు.