బీజేపీ నాయకుల అరెస్టు

బీజేపీ నాయకుల  అరెస్టు

SRD: సిర్గాపూర్‌లో బీజేపీ నాయకులను పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్ట్ చేశారు. నేడు బీజేపీ చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మండల సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్తుండగా సిర్గాపూర్‌లో వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని యూత్ అధ్యక్షులు యాదగిరి తెలిపారు.