రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

గుంటూరు: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిలకలూరిపేట నుంచి చుట్టుగుంట వచ్చే మార్గంలో మిర్చి యార్డ్ సమీపంలోని ఆలయం వద్ద గుర్తుతెలియని వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలు అవటంతో అక్కడికక్కడే మృతి చెందిందని, వివరాలు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.