11,200 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది: కలెక్టర్

VKB: జిల్లాలో ఆగస్టు నెలలో 11,200 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా 4,250 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించడం జరిగిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ మంత్రికి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి అధికారులతో కలిసి కలెక్టర్, SP పాల్గొన్నారు.