సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌కు మంత్రి శంకుస్థాపన
విజయనగరం జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో రూ.7.45 కోట్లతో నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రానికి శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నూతన తరగతి గదులను, ప్రహరీ గోడను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, అధికారులు పాల్గొన్నారు.