వైభవంగా బాపనమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం

వైభవంగా బాపనమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం

తూ.గో: అనపర్తి గ్రామ దేవత బాపనమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఉగాది పురస్కరించుకుని గ్రామంలో మహిళలు కలశాలతో నదీ జలాలు సేకరించి స్వయంగా అమ్మవారి మూల విరాట్‌కు అభిషేకం చేశారు. టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.