సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రకాశం:పెదచెర్లోపల్లి మండలంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం పర్యటించారు. ఈ మేరకు మండలంలోని లింగన్నపాలెంలో ఎంఎస్‌ఎం ఈ పార్క్‌కు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈనెల 11న పాల్గొనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సీఎం పర్యటన ఏర్పాట్లను టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.