అంతర్జాతీయ స్థాయి పోటీలకు పీడీ బాషా

అంతర్జాతీయ స్థాయి పోటీలకు పీడీ బాషా

NDL: సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీడీ బాషా అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఇవాళ పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ప్రధానోపాధ్యా యులు షబ్బీర్ హుస్సేన్ ఉపాధ్యాయులతో కలిసి బాషాను సత్కరించి, ఆయన ప్రతిభపై హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఆయన ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చెన్నైలో జరిగే 23వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు.