బాలాపూర్ గణేశుడు ఈసారి స్పెషల్ ఇదే!

HYD: బాలాపూర్ గణేశుడు ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ఈ సారి గణపతి మండపాన్ని అయోధ్య బాలరాముడు మందిరం నమూనాతో తీర్చిదిద్దనున్నట్టు బాలాపూర్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాదితో 45వ సంవత్సరంలోకి బాలాపూర్ గణనాథుడు అడుగుపెడుతున్నాడని ఆయన వెల్లడించారు. అలాగే అయోధ్య ఆలయ నమూనా భక్తులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.