మెరుగైన వైద్య సేవలు అందించాలి
SDPT: గ్రామ స్థాయిలో ఆశా, ఆరోగ్య కార్యకర్తలు పర్యవేక్షకుల సమక్షంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ సూచించారు. చిన్నకోడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.