డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలి: జిల్లా జడ్జి
SRPT: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ ఎం. రాధాకృష్ణ చహావన్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’ సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. అనంతరం విద్యార్థులు మాదకద్రవ్య నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు.