నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
SRD: రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఈనెల 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరుగుతుందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. 10 మండలాల్లోని 30 సర్పంచి, 262 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.