నిర్లక్ష్యం చేస్తే సకల జనుల సమ్మె తప్పదు : రైతు సంఘం
KMM: మధిరలోని ఆర్టీసీ డిపో వద్ద గురువారం జరిగిన కార్మికుల సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే కార్మికులు ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సకల జనుల సమ్మె తప్పదని హెచ్చరించారు. తక్షణమే చర్చలు జరిపి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు.