భూ భారతి చట్టం రైతులకు అండగా ఉంటుంది

MBNR: భూ సమస్యలు, కుటుంబ తగాదాలు తలెత్తకుండా భూభారతిచట్టం రైతులకు అండగాఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మాచన్ పల్లిలో నిర్వహించిన అవగాహనసదస్సులో కలెక్టర్ విజయేంద్రబోయితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. భూసమస్యల సత్వరపరిష్కారానికి ఈచట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.