మార్పులు లేకుండా బరిలోకి కంగారూలు

మార్పులు లేకుండా బరిలోకి కంగారూలు

యాషెస్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో టెస్టుకు జట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈ టెస్టులో కూడా బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. దీంతో ఈ మ్యాచ్‌కు కూడా స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించనున్నాడు. గాయాల నుంచి ఇంకా కోలుకోని ప్యాట్ కమిన్స్, హెజెల్‌వుడ్‌కు ఈ మ్యాచ్‌కు కూడా విశ్రాంతినిచ్చారు.