'రేపటి మహాసభలను జయప్రదం చేయండి'
GDWL: హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ మూడవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ గద్వాల జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన గద్వాల పట్టణంలోని మార్కెట్, సివిల్ సప్లై, ఎన్‌డీఆర్ గోదాంలలోని హమాలీ కార్మికులతో కలిసి ప్రచారం నిర్వహించారు. రేపు ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్‌లో ఈ మహాసభలు జరుగుతాయన్నారు.