పేదవారి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు: ఎమ్మెల్యే

పేదవారి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల పట్టణంలోని 17వ వార్డులో నూతనంగా నిర్మించిన 17 ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు.