టీడీపీ యువ నాయకుడు మృతి

TPT: నగర మాజీ తెలుగు యువత అధ్యక్షుడు మంత్రి పురుషోత్తం మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని నగర మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.