అమెజాన్‌లో 1800 మంది ఇంజినీర్ల కోత..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీంతో క్లౌడ్ సర్వీసెస్, రిటైల్, గ్రోసరి, యాడ్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ఈ లేఆఫ్ ప్రభావం 1800 మంది ఇంజినీర్లపై ఉన్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా, వాషింగ్టన్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో 4,700 మందికిపైగా లేఆఫ్ జాబితాలో ఉంటే అందులో 40 శాతం మంది ఇంజినీర్లే ఉన్నారు.