లోన్‌ల పేరిట రూ. 25లక్షలకు టోకరా..!

GNTR: సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారికి లోన్‌లు ఇప్పిస్తామని నమ్మించి సంగడిగుంటకు చెందిన ఓ మహిళ మోసం చేసిందని ఫిరంగిపురానికి చెందిన చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాటలు నమ్మి 600 మందితో రూ. 12 లక్షలు, తాను సొంతంగా రూ.13 లక్షలు చెల్లించానని చంద్రలేఖ సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు కట్టినవారు తనను నిలదీస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు.