ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: జేసీ

NLG: ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని జేసీ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ప్రజావాణి ఫిర్యాదులను సమీక్షిస్తూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సాధించాలన్నారు.