నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నెల్లూరులోని 33/11 KV రామూర్తినగర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన్నేపల్లి శ్రీధర్ తెలిపారు. రామూర్తినగర్, కర్ణాలమిట్టచ రామలింగాపురం పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం ఉండుందన్నారు.  వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.