మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు

మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు

KMR: ఎర్ర పహాడ్ పీహెచ్‌సీలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఎర్ర పహాడ్ PHC వైద్యాధికారి డాక్టర్ ఖాసీం తెలిపారు. మంగళవారం డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళలకు రక్తహీనత తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.