నూతన ఎస్సైగా శివానంద్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

నూతన ఎస్సైగా శివానంద్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

WNP: కొత్తకోట మండలానికి నూతన ఎస్సైగా శివానంద్ గౌడ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాజపూర్ ఎస్సైగా పనిచేస్తూ కొత్తకోట‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న మంజునాథ్ రెడ్డి ఎస్పీ కార్యాలాయనికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.