విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

బాపట్ల: విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి చెందిన సంఘటన రేపల్లె పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. రేపల్లె పట్టణంలోని ఇసుకపల్లి 17వ వార్డుకు చెందిన మోపిదేవి సుమతి(42) విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. మృతదేహాన్ని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేపల్లె పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమతి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.