సబ్ స్టేషన్ పనులు ఆపేయాలని ధర్నా
JGL: కథలాపూర్‌లో 220/132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులు ఆపేయాలని కోరుతూ గ్రామ యువకులు ఇవాళ రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సబ్ స్టేషన్ వల్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు రేడియేషన్ ప్రభావం ఉండి అనారోగ్యానికి గురవుతారన్నారు. విద్యార్థులకు ఇబ్బందిగా మారిన పనులను ఆపేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.