'ధాన్యం కొనుగోలు చేయకుంటే రాసుల వద్దే చస్తాం'
కృష్ణా జిల్లా పెడన మండలం నడుపూరులో ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ధాన్యం ఆరలేదని చెప్పి RSK సిబ్బంది వెళ్లిపోతున్నారని, 5 రోజులు ఆరబెట్టినా వర్షాల వల్ల నిమ్ము శాతం తగ్గడం లేదని వాపోయారు. "ధాన్యం కొనకపోతే పురుగు మందు తాగి రాసుల వద్దే చస్తాం" అంటూ రైతులు కన్నీరుమున్నీరయ్యరు.