మల్లయ్య గిరి గుట్టకు భక్తుల పాదయాత్ర
సంగారెడ్డి: శ్రీ గురుదత్త పౌర్ణమి పురస్కరించుకొని ఝరాసంగం మండలంలోని మల్లయ్య గిరి గుట్టకు బుధవారం భక్తులు పాదయాత్ర చేపట్టారు. కంగ్టి మండలం తడ్కల్ నుంచి శ్రీ దత్త పల్లకి సేవతో 80 కిలోమీటర్ల దూరం వరకు కాలినడకతో వెళ్లారు. మల్లయ్య గిరి గుట్ట ఆశ్రమంలో శ్రీ దత్త జయంతి పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని పాదయాత్రికులు తెలిపారు.