బీటీ రోడ్ నిర్మాణం పూర్తి.. గ్రామస్తులు హర్షం వ్యక్తం
SS: సోమందేపల్లి మండలం రేణుకానగర్ వద్ద హిందూపురం మెయిన్ రోడ్‌కు కలుపుతూ రూ.45 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్ పనులు పూర్తయ్యాయి. దీంతో గ్రామస్థుల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం టీడీపీ నాయకులు రోడ్ పనులను పరిశీలించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ వెంకటేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.