మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్సై

WNP: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని రేవల్లి మండల ఎస్సై రజిత శనివారం అన్నారు. వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు. బైక్ నడిపే వారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.