మే 13న పాలిసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు
NRML: మే 13వ తేదీన నిర్వహించనున్న పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన, ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిప్లమో కోర్సుకు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామన్నారు.