కుల గణన సర్వే బకాయిలపై ఆశా వర్కర్ల ఆందోళన

కుల గణన సర్వే బకాయిలపై ఆశా వర్కర్ల ఆందోళన

MDCL: తెలంగాణలో ఏడాదిన్నర క్రితం నిర్వహించిన కుల గణన సర్వేలో పాల్గొన్న ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో ఆల్వాల్ బాధితులు ప్రజావాణి వేదికగా ఆందోళన చేపట్టారు. సుమారు 60 మంది పాల్గొన్న ఈ ఆందోళనలో తమకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.