VIDEO: సోమశిల జలాశయానికి వరద కొనసాగింపు
NLR: సోమశిల జలాశయానికి గత కొద్ది రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు క్రాస్ట్ గేట్ల ద్వారా పెన్నా డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 12,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం పెన్నా డెల్టాకు 32,750 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.