తుఫాన్ ఎఫెక్ట్.. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు
AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మాగ లేఔట్ రైల్వే బ్రిడ్జి వద్ద వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పలుచోట్ల రహదారులపై వరద నీరు నిలిచింది.