స్కూటీని తప్పించబోయి ఆటో బోల్తా

స్కూటీని తప్పించబోయి ఆటో బోల్తా

NZB: ఇందల్వాయిలోని తిర్మన్పల్లిలో వెంకటేశ్వర ఆలయం వద్ద స్కూటీని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. రాంపూర్ వైపు వెళ్తున్న ఆటో ఆలయం వద్దకు రాగానే అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన స్కూటీని తప్పించే ప్రయత్నంలో బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.