VIDEO: సాగర్ కాలువలో కొట్టుకుపోతున్న మృతదేహం

VIDEO: సాగర్ కాలువలో కొట్టుకుపోతున్న మృతదేహం

KMM: ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సాగర్ కాలువలో ఆదివారం ఉదయం ఓ గుర్తు తెలియని మృతదేహం స్థానికుల కంట పడింది. సాగర్ కాలువలో ఎగువ నుంచి ఓ మృతదేహం కొట్టుకు వస్తూ దిగువకు వెళ్లిందని స్థానికులు చెప్పారు. సదరు మృతదేహం మగ వ్యక్తిది అయి ఉంటుందని అన్నారు. దీంతో ఈ విషయంపై స్థానికులు మండల పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.