రూ. 1.72 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

AP: విశాఖలోని మధురవాడలో రూ. వెయ్యి కోట్లతో రెండు కీలకమైన ప్రాజెక్టులు మొదలు కాబోతున్నాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. మధురవాడ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జీవీఎంసీ ఆరో వార్డులో రూ.1.72 కోట్లతో ప్రతిపాదించిన రోడ్లు, డ్రెయిన్లకు వైభవ్ నగర్‌లో ఆయన శంకుస్థాపన చేశారు.