VIDEO: సూర్యలంక బీచ్.. పర్యాటక స్వర్గం
బాపట్ల పట్టణానికి 9KM దూరంలో ఉన్న సూర్యలంక బీచ్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన తీరం. ఇక్కడ అలల ఉధృతి తక్కువగా ఉండటంతో పిల్లలు, పెద్దలు నిర్భయంగా ఈత కొట్టవచ్చు. ఇసుక తిన్నెలు, సూర్యోదయ అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. తీరం ఒడ్డునే AP పర్యాటక శాఖ వారి రిసార్ట్స్ ఉన్నాయి. విహారానికి, కుటుంబంతో సరదాగా గడపడానికి ఇది రాష్ట్రంలోని ఉత్తమ తీర ప్రాంతాలలో ఒకటి.