'వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు సద్వినియోగం'
ప్రకాశం జిల్లా ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని SP హర్షవర్ధన్ రాజు సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఐటీ విభాగం పోలీసులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఈ సేవల్లో చలానా చెల్లింపులు, ఎఫ్ఎఆర్ డౌన్లోడ్, కేసుల స్థితిగతులను తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు 9552300009 నంబర్‌ను సేవ్ చేసి, 'హాయ్' అని మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలను పొందవచ్చన్నారు.