VIDEO: శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు

VIDEO: శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు

JGL: ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కే.హరిత దంపతులు శనివారం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం దేవస్థానం తరఫున ఈవో సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం, ప్రసాదం అందజేసి సన్మానించారు.