రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో 'సింహాచలం' జోరు

రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో 'సింహాచలం' జోరు

VSP: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయం భక్తులకు అందించే సదుపాయాల ఆధారంగా రాష్ట్రంలో మూడవ ర్యాంక్ పొందింది. జనవరి నెలలో భక్తుల అభిప్రాయాల ప్రకారం ప్రసాదాల రుచి, నాణ్యతలో 82.8 పాయింట్లు, పారిశుద్ధ్య నిర్వహణలో 70.7 పాయింట్లుతో అగ్రస్థానంలో ఉంది. దర్శనం విషయంలో మూడవ, తాగునీటి సౌకర్యంలో ఐదో స్థానంలో ఉంది.