అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.79 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మురళీ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పి.ఎస్.ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన సభలో మంత్రి పాల్గొన్నారు.