జూదం ఆడితే చర్యలు తప్పవు: సీఐ

జూదం ఆడితే   చర్యలు తప్పవు: సీఐ

NLR: బుచ్చి కొడవలూరు మండల పరిధిలో కొత్త వంగల్లు గ్రామ వ్యవసాయ భూముల్లో యదేచ్చగా జూదం ఆడుతున్నారు. దీంతో బుచ్చి సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సంతోష్ రెడ్డి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని పట్టుకోగా వారి వద్ద నుండి రూ. 64,500 నగదు, 11 వాహనాలు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.